మోదీ.. చరిత్ర తెలుసుకో!: పొన్నం
TG: నిన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా నెహ్రూపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను మంత్రి పొన్నం ప్రభాకర్ ఖండించారు. మోదీ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్వాతంత్ర్య ఉద్యమం గురించి తెలియని ప్రధాని.. నెహ్రూని అవమానించేలా మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ముందు చరిత్ర తెలుసుకోవాలని సూచించారు.