రహదారి నిర్మాణం పూర్తి చేయాలి: గిరిజన సంఘం

ASR: అరకు మండలం మజ్జివలస నుంచి కమలతోట వరకు రహదారి నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం మండల కమిటీ సభ్యులు కుమిడి రమేష్, భాస్కరరావు శుక్రవారం డిమాండ్ చేశారు. గతంలో రహదారి నిర్మాణ పనులు ప్రారంభించి, చిప్స్ వేసి మధ్యలోనే నిలిపివేశారన్నారు. దీంతో ప్రయాణం చేయాలంటే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని తెలిపారు. అధికారులు స్పందించాలని కోరారు.