ఎస్సీ ఉప కులాలకు రాజకీయ అవకాశాలు కల్పిస్తాం: మంత్రి సీతక్క

ఎస్సీ ఉప కులాలకు రాజకీయ అవకాశాలు కల్పిస్తాం: మంత్రి సీతక్క

MLG: జిల్లా కేంద్రంలో గురువారం ఎస్సీ ఉపకులాల కృతజ్ఞత సన్మాన సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీతక్క హాజరై, మాట్లాడుతూ..ఎస్సీ ఉప కులాలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. నామినేటెడ్ పదవుల్లో ప్రత్యేక అవకాశాలు, ఇందిరమ్మ ఇళ్ల పథకంలో 100 ఇళ్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం SC ఉపకులాల అభివృద్ధికి దోహదం చేస్తుందని తెలిపారు.