ఘనంగా బంగారు పోచమ్మ తల్లి బోనాల జాతర

ఘనంగా బంగారు పోచమ్మ తల్లి బోనాల జాతర

PDPL: రామగుండం రైల్వే స్టేషన్ ఏరియా గుట్టపై కొలువై ఉన్న శ్రీ నల్ల పోచమ్మ తల్లి సహిత బంగారు పోచమ్మ తల్లి ఎదురు కొలుపు, బోనాల జాతర ఆదివారం కన్నుల పండుగగా జరిగింది. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పోచమ్మ తల్లికి బోనాలు, మొక్కులు తీర్చుకున్నారు. జాతర నిర్వాహకులు కన్నూరి సతీష్ కుమార్ పర్యవేక్షణలో ఆలయ కమిటీ సభ్యులు మల్లేశం, సాంబయ్య, పాల్గొన్నారు.