ఏప్రిల్ 2 నుంచి సలేశ్వరం జాతర

ఏప్రిల్ 2 నుంచి సలేశ్వరం జాతర

TG: నల్లమల అడవుల్లో 'తెలంగాణ అమర్‌నాథ్'గా పేరుగాంచిన సలేశ్వరం జాతర APR 2 నుంచి 6వ తేదీ వరకు జరగనుంది. నాగర్‌‌‌‌కర్నూల్‌‌‌‌ జిల్లా లింగాల మండలంలో జాతర జరుగుతుంది. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చి వెయ్యి అడుగుల లోతు లోయలో ఉన్న లింగమయ్యను దర్శించుకోనున్నారు. ఇక్కడ చెంచులే పూజారులుగా వ్యవహరిస్తారు.