'సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం ఉదృతం'
VZM: ఈ నెల 25, 27వ తేదీల్లో విజయవాడలో జరిగే రిలే నిరాహార దీక్షలను విజయవంతం చేయాలని ఫ్యాప్టో జిల్లా నేతలు పిలుపునిచ్చారు. ఈ మేరకు జడ్పీ హాల్లో ఇవాళ సమావేశం నిర్వహించారు. 12వ పీఆర్‌సీ, పాత పెన్షన్, డీఏలు వంటి డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని కోరింది. 27న ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామన్నారు.