VIDEO: 'నానో యూరియా వల్ల అధిక దిగుబడులు'

KDP: నానో యూరియా వాడటం వల్ల పంటల సాగులో అధిక దిగుబడులు సాధించవచ్చునని మండల వ్యవసాయాధికారి చెన్నారెడ్డి పేర్కొన్నారు. గురువారం పులివెందులలోని ఏవో కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. నానో యూరియాతో నత్రజని అధికంగా ఉంటుందని, పంటల ఉత్పత్తులు నాణ్యతగా ఉంటాయన్నారు. ఈ మేరకు పులివెందుల మండలంలో యూరియా కొరత లేదని, రైతు సేవా కేంద్రాలలో, ప్రైవేట్ డీలర్ల వద్ద యూరియా స్టాక్ ఉందన్నారు.