డిసెంబర్‌లో ప్రతిచోటా క్రీస్తు ఆరాధన: మంత్రి
W.G: డిసెంబర్ వచ్చిందంటే ప్రతి గ్రామం, పట్టణంలో క్రీస్తు ఆరాధనలు జరుగుతాయని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పాలకొల్లు సమీపంలోని పూలపల్లిలో ఏసు అనుచరులు నిర్వహించిన సేవకుల క్రిస్మస్ కార్యక్రమంలో ఆయన ఆదివారం పాల్గొన్నారు. ఈనెల 27న తన కార్యాలయం వద్ద క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.