వెనుకబడిన విద్యార్థులపై వ్యక్తిగత శ్రద్ధ వహించాలి: ఎంఈవో
SRPT: శిక్షణలో నేర్చుకున్న అంశాలను పాఠశాలలో ఉపాధ్యాయులు అవలంబించి, తరగతి గదిలో బోధన చేయాలని ఎంఈవో ఉపేందర్ రావ్ తెలిపారు. ఇవాళ నడిగూడెం మండలంలోని తెల్లబెల్లి ఉన్నత పాఠశాలలో స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం పద్మావతి అధ్యక్షతన ప్రాథమిక పాఠశాల కాంప్లెక్స్ సమావేశం నిర్వహించారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించి,విద్యార్థులకు టైం టేబుల్ ప్రకారం బోధన చేయాలని కోరారు.