పుట్టపర్తి సాయి ఆరామంలో ఘనంగా ఉగాది వేడుకలు

పుట్టపర్తి సాయి ఆరామంలో ఘనంగా ఉగాది వేడుకలు

సత్యసాయి: పుట్టపర్తి సాయి ఆరామంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో శ్రీ పరాభవ నామ ఉగాది వేడుకలను సత్యసాయి జిల్లా అధికారులు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో రాష్ట్ర మంత్రి సవిత, కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌, ఎస్పీ సతీష్‌ కుమార్‌, జాయింట్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉగాది పురస్కారాలు అందజేశారు.