గొర్రెను చంపిన చిరుత పులి

గొర్రెను చంపిన చిరుత పులి

SRCL: చందుర్తి మండల కేంద్రంలోని అటవీ ప్రాంతం శివారులోని ఒక చెట్టుపై చనిపోయిన గొర్రెను సోమవారం ఉదయం గ్రామస్థులు గుర్తించారు. చందుర్తి మోత్కరావుపేట వెళ్లే ప్రధాన రహదారిలో గత కొద్దిరోజులుగా చిరుత పులి సంచరిస్తున్న విషయం తెలిసిందే. అటవీ శాఖ అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తూ జాగ్రత్త చర్యలను ప్రజలకు వివరిస్తున్నారు.