YSR ఉద్యాన విశ్వవిద్యాలయంలో PG, PHD కోర్సులకు కౌన్సెలింగ్
W. G: తాడేపల్లిగూడెం(M) వెంకటరామన్న గూడెం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో ఈ నెల 17, 18వ తేదీల్లో పీజీ, పీహెచ్‌డీ కోర్సులలో ప్రవేశానికి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ బి.శ్రీనివాసులు తెలిపారు. నిన్న సాయంత్రం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 17న పీజీ, 18న పీహెచ్‌డీ కోర్సులకు మాన్యువల్ కౌన్సెలింగ్ జరుగుతుందని తెలిపారు.