జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె
BDK: జిల్లాలో ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె సందర్భంగా బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. కొత్తగూడెం, భద్రాచలం, మణుగూరు, ఇల్లందు డిపోల్లో కార్మికులు స్వచ్ఛందంగా విధులను బహిష్కరించి.. డిపోల ఎదుట ధర్నా చేపట్టారు. కొత్తగూడెం డిపో ఎదుట సీపీఐ నాయకులు.. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ఆందోళనకు దిగారు. మరోవైపు సమ్మె నేపథ్యంలో బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.