రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
ASR: రంపచోడవరం మండలం బోర్నగూడెం సమీపంలో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం పాలయ్యారు. మృతుడు తాటివాడ గ్రామానికి చెందిన రామన్నదొరగా గుర్తించారు. ఆయన బైక్‌పై రంపచోడవరం నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా, బోర్నగూడెం వద్ద వాహనం అదుపు తప్పి పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.