ప్రతి కార్మికుడికీ పెన్షన్ ఇవ్వాలి: కోటంరాజు

MHBD: భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధులను ప్రైవేట్ సంస్థకు అప్పగించరాదని (BCWU) యూనియన్ CITU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి R. కోటంరాజు డిమాండ్ చేశారు. గురువారం నరసింహులపేట మండల కేంద్రంలో నిర్వహించిన మహాసభలో ఆయన మాట్లాడారు. అధికారులను బెదిరించి కార్మికుల సొమ్ము పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. 60 సంవత్సరాలు దాటిన కార్మికులందరికీ వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలన్నారు.