టీచర్‌గా మారిన ట్రైనీ కలెక్టర్
SRD: న్యాల్కల్‌లోని కస్తూర్బా గాంధీ పాఠశాల (కేజీబీవీ)ను శుక్రవారం ట్రైనీ కలెక్టర్ ప్రతిభా శేఖర్ సందర్శించారు. ఈ మేరకు ఆమె విద్యార్థులకు పాఠాలు బోధించి, ఒక్క రోజు టీచర్‌గా మారారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని సిబ్బందిని ఆదేశించారు. విద్యార్థులు శ్రద్ధగా చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలన్నారు. న్యాల్కల్ KGBVను జిల్లాలో మొదటి స్థానంలో ఉంచాలని కోరారు.