బోర్లంలో ప్రచారం నిర్వహించిన పార్టీ ఇంఛార్జ్ భాస్కర్ రెడ్డి

KMR: బాన్సువాడ మండలంలోని బోర్లంలో గ్రామంలో ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్‌కు మద్దతుగా పార్టీ పోచారం భాస్కర్ రెడ్డి ప్రచారం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అమలు కానీ హామీలను ఇచ్చే ప్రజలను మోసం చేసిందని, బీజేపీ పార్టీ ప్రజలను నమ్మించి మోసం చేయడంలో దిట్ట అని అన్నారు. ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి తమ అభ్యర్థిని గెలిపించాలని కోరారు.