చెరువుల మ్యాపింగ్‌కు సిద్దిపేట కలెక్టర్ ఆదేశం

చెరువుల మ్యాపింగ్‌కు సిద్దిపేట కలెక్టర్ ఆదేశం

SDPT: జిల్లాలోని వెట్ ల్యాండ్స్ సంరక్షణకు తక్షణమే మ్యాపింగ్ సిద్ధం చేయాలని కలెక్టర్ కె. హైమావతి అధికారులను ఆదేశించారు. చెరువులు, కుంటల రికార్డులను పరిశీలించి, అవి ఆక్రమణకు గురికాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ప్రతి మండలం వివరాలను నివేదించాలని సూచించారు.