'హిందువులు కుటుంబ నియంత్రణను పాటించవద్దు'

TG: ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందువులు కుటుంబ నియంత్రణను పాటించవద్దని అన్నారు. వీలైనంత ఎక్కువ మంది పిల్లలను కనాలని సూచించారు. హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలంటే మన సంఖ్య పెరగాలని పేర్కొన్నారు. హిందువులు ఐక్యంగా ఉంటేనే దేశం భద్రతగా ఉంటుందని తెలిపారు. దేశం, ధర్మం లేకుంటే భవిష్యత్తు ఉండదని హెచ్చరించారు.