VIDEO: 'సీపీఐ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి'

సత్యసాయి: ఈనెల 23న ఒంగోలులో జరుగుతున్న 28వ సీపీఐ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని హిందూపురం సీపీఐ కార్యదర్శి వినోద్ కుమార్ కోరారు. హిందూపురంలోని సీపీఐ కార్యాలయం వద్ద మంగళవారం సీపీఐ మహాసభల పోస్టర్ ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా వినోద్ మాట్లాడుతూ.. ఒంగోలులో ఈనెల 23, 24, 25 తేదీలలో బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు తెలిపారు.