శ్రీశైలంలో జ్వాలా వీరభద్ర స్వామికి విశేష పూజలు

NDL: లోక కళ్యాణం కోసం శ్రీశైల ఆలయ ప్రాంగణంలోని వీరభద్ర స్వామికి బుధవారం సాయంత్రం విశేష పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో మల్లికార్జున స్వామివారి ఆలయానికి ఉత్తర భాగంలో మల్లికా గుండానికి పక్కనే ఉన్న వీరభద్రస్వామి జ్వాలా మకుటంతో పది చేతులతో విశిష్ట రూపంలో దర్శనమిస్తారు. మహాగణపతి పూజ తదుపరి శ్రీజ్వాలా వీరభద్ర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.