తాండూరుకు రూ.10 కోట్ల నిధులు
VKB: తాండూరు నియోజకవర్గ అభివృద్ధికి రూ.10 కోట్ల నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తెలిపారు. ఉపాధి హామీ పథకం కింద మహిళా సంఘ భవనాలు, వీఓఏ భవనాలు, ప్రభుత్వ పాఠశాలల ప్రహరీ గోడలు నిర్మించనున్నట్లు చెప్పారు. పనులు త్వరగా ప్రారంభించి నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.