మంత్రి సురేఖతో అటవీ శాఖ ప్రధాన సంరక్షణాధికారి

WGL: రాష్ట్ర అటవీ శాఖ ప్రధాన సంరక్షణాధికారిగా డా.సీ.సువర్ణ నియామకమై, ఇటీవల బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్బంగా మంత్రి కొండా సురేఖని ఈరోజు జూబ్లీహిల్స్‌లో గల వారి స్వగృహంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. 1991 IFS బ్యాచ్‌కు చెందిన సువర్ణ ఉమ్మడి ఏపీతో పాటు తెలంగాణలో వివిధ హోదాల్లో పనిచేసి అదనపు ACCFగా బాధ్యతలు స్వీకరించారు. మంత్రి ఆమెకు అభినందనలు తెలిపారు.