ఎన్నో ఏళ్ల కల.. కేశవదాసుపాలెం రహదారి పూర్తి
కోనసీమ: ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న కేశవదాసుపాలెం రహదారి పనులు విజయవంతంగా పూర్తి అవ్వడంతో ప్రజల కల నెరవేరింది. దీంతో దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న రవాణా ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం లభించడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. గతంలో ఎక్కడికైనా ప్రయాణం చేయాల్సి వస్తే రోడ్లు గుంతలుగా ఉండడం వల్ల చాలా ఇబ్బందులు ఎదురయ్యేవని, ఇప్పుడు ఆ సమస్య ఉండదని వారు పేర్కొన్నారు.