VIDEO: లోతట్టు ప్రాంతాలు జలమయం.. రైతుల ఆందోళన

NZB: వర్ని మండలంలో శనివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం జనజీవనాన్ని స్తంభింపజేసింది. చెరువులు, వాగులు, డ్రైనేజీలు పొంగిపొర్లడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు, ఆకుకూరలు, కూరగాయల పంటలు నేలకొరగడంతో రైతులు తీవ్ర నష్టపోయారని, పంట నష్టపరిహారం అందించాలని కోరుతున్నారు.