కోల్‌కతానూ లక్ష్యంగా చేసుకుంటాం: పాక్

కోల్‌కతానూ లక్ష్యంగా చేసుకుంటాం: పాక్

పాకిస్తాన్ రక్షణశాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి రెచ్చగొట్టే వాఖ్యలు చేశారు. భవిష్యత్తులో భారత్ దాడులకు పాల్పడితే కోల్‌కతానూ లక్ష్యంగా చేసుకుంటామని అన్నారు. ప్రతిదాడులను ఆ ప్రాంతం వరకూ తీసుకెళ్తామని తెలిపారు. ఎక్కడైనా కొంతమంది మృతదేహాలను పడేసి వారు ఉగ్రవాదులేనని నమ్మించేలా భారత్ ‌బూటకపు ఆపరేషన్ రూపొందించినట్లు నివేదికలు ఉన్నాయంటూ అక్కసు వెళ్లగక్కారు.