అచ్చెన్నాయుడికి అభినందనలు
SKLM: మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఎంపికవ్వడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఆయన నియామకం పట్ల జిల్లా టీడీపీ అధ్యక్షులు మొదలవలస రమేష్, శ్రీకాకుళం నగర పార్టీ అధ్యక్షులు పాండ్రంకి శంకర్ అభినందనలు తెలిపారు. అచ్చెన్నాయుడు తన అనుభవంతో పార్టీ బలోపేతానికి, ఉత్తరాంధ్ర అభివృద్ధికి మరిన్ని సేవలు అందించాలని వారు ఆకాంక్షించారు.