KKR vs PBKS: హెడ్ టు హెడ్ రికార్డ్స్
IPL 2026లో ఇవాళ కోల్‌కతా, పంజాబ్ తలపడనున్న సంగతి తెలిసిందే. టోర్నీలో ఆడిన రెండూ ఓడిపోయిన కోల్‌కతా.. ఇందులో గెలిచి ఖాతా తెరవాలని చూస్తోంది. అయితే గత 2 మ్యాచుల్లోనూ KKRను ఓడించిన పంజాబ్.. ఈ టోర్నీలో ఇప్పటికే 2 గెలిచి విజయోత్సాహంతో ఉంది. ఇరుజట్లు తలపడిన 35 సందర్భాల్లో KKR 21, PBKS 13 విజయాలు అందుకున్నాయి. మరి ఇవాళ కోల్‌కతా ప్రదర్శన ఎలా ఉంటుందో చూడాలి.