అక్రమంగా ఇసుక తరలిస్తున్న నాలుగు లారీలు సీజ్

అక్రమంగా ఇసుక తరలిస్తున్న నాలుగు లారీలు సీజ్

NTR: కంచికచర్ల మండలంలోని వేములపల్లి ఇసుక ర్యాంపు నుంచి అక్రమంగా తరలిస్తున్న నాలుగు ఇసుక లారీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అవసరమైన అనుమతులు, పత్రాలు లేని కారణంగా లారీలను సీజ్ చేసి, వ్యవసాయ మార్కెట్ యార్డ్‌కు తరలించినట్లు ఎస్సై విశ్వనాథ్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.