VIDEO: ఉట్నూర్‌లో పోలీసుల భారీ బందో బస్తు

VIDEO: ఉట్నూర్‌లో పోలీసుల భారీ బందో బస్తు

ADB: ఉట్నూర్ మండల కేంద్రంలో ఆదివాసీలు నిర్వహించనున్న ధర్మ యుద్ధ సభ నేపథ్యంలో ఆదివారం వ్యాపార సముదాయాలు నిర్మానుష్యంగా మారాయి. స్వచ్ఛందంగా దుకాణాలు మూసి ఉంచారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ నేతృత్వంలో ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పోలీసు యంత్రాంగం భారీ బందో బస్తుతో అప్రమత్తంగా ఉంది. వాహనాల రాకపోకలకు ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూస్తున్నారు.