'4 ఏళ్ల మనోవేదన తీరింది'.. శ్రీవారి సన్నిధిలో కవిత
TG: జాగృతి అధ్యక్షురాలు కవిత కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడంతో కాలినడకన మొక్కు తీర్చుకున్నట్లు ఆమె తెలిపారు. 'గత నాలుగేళ్లుగా పడ్డ వేదన స్వామి దయతో తీరింది. సత్యం, న్యాయం నావైపే ఉన్నాయని రుజువైంది' అని పేర్కొన్నారు. ఇదే క్రమంలో త్వరలో తెలంగాణ ప్రజల పక్షాన కొత్త రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్లు కవిత పేర్కొన్నారు.