డ్రైనేజీ పనులు ప్రారంభించిన కార్పోరేటర్

హనుమకొండ జిల్లా కాజీపేట మండల కేంద్రంలో సోమవారం 40 లక్షల వ్యయంతో చేపట్టిన సైడ్ డ్రైనేజీ పనులను కార్పోరేటర్ విజయ శ్రీ ప్రారంభించారు. ఇందిరమ్మ కమిటీ సభ్యులతో కలిసి పలు ఇళ్లకు ముగ్గులు పోశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గుంటి కుమార్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.