వెల్జర్ల గ్రామంలో పోలీసుల కవాతు
RR: షాద్ నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ మండలం వెల్జర్ల గ్రామంలో సీఐ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు కవాత్ నిర్వహించారు. ప్రతి ఒక్కరు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించి పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికలు శాంతియుత వాతావరణంలో జరిగేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని ఈ సందర్భంగా కోరారు.