టెక్కలిలో వైసీపీ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు

SKLM :టెక్కలిలో సోమవారం వైసీపీ చేపట్టిన రైతు ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. రైతు సమస్యలపై వైసీపీ ఇన్‌ఛార్జ్ పేరాడ తిలక్ ఆధ్వర్యంలో ర్యాలీకి ఏర్పాట్లు జరుగుతుండగా, స్థానిక అంబేడ్కర్ కూడలికి చేరుకున్న పోలీసులు ర్యాలీకి అనుమతి లేదని తెలిపారు. దీంతో వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు ర్యాలీని నిలిపివేయడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.