శ్రీ సాయి అన్నపూర్ణేశ్వరి నూతన భవనం ప్రారంభం
SS: పెనుకొండ(M) ఎర్రమంచి గ్రామ పంచాయతీ జాతీయ రహదారి 44 పక్కన ప్రసిద్ధి పొందిన శ్రీ శిరిడి సాయి బాబా ఆలయంలో నూతన శ్రీ సాయి అన్నపూర్ణేశ్వరి భవనాన్ని గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త పద్మావతి గుర్రప్ప ఆధ్వర్యంలో ఆలయంలో విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భవనంలో భక్తులకు నారాయణ సేవలో భాగంగా అన్నదానం చేశారు.