రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

JN: బచ్చన్నపేట మండలంలోని అలంపూర్ గ్రామ శివారులో విషాదం చోటు చేసుకుంది. నేషనల్ హైవే 365పై ద్విచక్రవాహనాన్ని డీసీఏం వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.