దేవాలయ అధికారులను అభినందించిన కలెక్టర్
ELR: సంప్రదాయేతర ఇంద్ర వనరులను సమర్థవంతంగా వినియోగిస్తున్న ద్వారకాతిరుమల దేవాలయ అధికారులను జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆదివారం అభినందించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. గోవర్ధన ప్రాజెక్టులో భాగంగా టీటీడీ (టన్ ఫర్ డే) సామర్థ్యం కలిగిన బయోగ్యాస్ ప్లాంటును ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. వ్యర్థాల ద్వారా బయోగ్యాస్ ఉత్పత్తి గురించి వివరించారు.