'విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి'
ELR: నేటి విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండి, బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని ట్రైనీ ఐపీఎస్ జయ శర్మ ఆకాంక్షించారు. ఇవాళ ఏలూరు రామనగర్ కాలనీలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నూతన చట్టాలు, ట్రాఫిక్ నిబంధనలు, సైబర్ క్రైమ్ పట్ల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.