రేపు పంజాబ్, ఢిల్లీ మ్యాచ్ నిర్వహణపై క్లారిటీ

రేపు పంజాబ్, ఢిల్లీ మ్యాచ్ నిర్వహణపై క్లారిటీ

IPL 2025లో భాగంగా రేపు ధర్మశాల వేదికగా పంజాబ్, ఢిల్లీ మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. అయితే, ఈ మ్యాచ్ జరుగుతుందా? లేదా? అని అభిమానుల్లో ఆందోళన నెలకొంది. తాజాగా దీనిపై BCCI స్పష్టత ఇచ్చింది. మ్యాచ్‌ను నిర్వహించుకోవచ్చని కేంద్రం తెలిపినట్లు వెల్లడించింది. అలాగే, ఈనెల 11న జరగాల్సిన MI, పంజాబ్ మ్యాచ్ వేదికను మాత్రం ముంబైకి మార్చింది. నూతన తేదీని త్వరలో ప్రకటిస్తామని తెలిపింది.