'ఉపాధ్యాయుడిని నియమించాలి'

'ఉపాధ్యాయుడిని నియమించాలి'

ASR: కొయ్యూరు మండలం జాజులబంధ గ్రామంలో ఉన్న పాఠశాలకు ఉపాధ్యాయుడిని నియమించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. గ్రామంలో సుమారు 35 మంది విద్యార్థులు ఉన్నారన్నారు. గతంలో టీచర్‌ను నియమించినట్లు పేర్కొన్నారు. అయితే ఈ ఏడాది టీచర్ ఎవరు రావడం లేదన్నారు. దీంతో పిల్లలు చదువుకు దూరం అవుతున్నారన్నారు. అధికారులు టీచర్‌ని నియమించాలని కోరుతు ఇవాళ నిరస తెలిపారు.