స్కూల్ ఆస్తులను ధ్వంసం చేసిన దుండగులు

స్కూల్ ఆస్తులను ధ్వంసం చేసిన దుండగులు

శ్రీకాకుళం: లక్ష్మీనర్సుపేట మండలంలోని కొమ్ము వలస హైస్కూల్ ఆస్తులు గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేసినట్లు శుక్రవారం విద్యా కమిటీ ఛైర్మన్ ఆర్.చలపతి రావు సరుబుజ్జిలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గురువారం అర్దరాత్రి పాఠశాలలో చొరబడి పూల కుండీలు, మొక్కలు, తలుపులు, విద్యుత్ సామాగ్రి, వాటర్ పైపులను నాశనం చేశారు. పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.