ఇంఛార్జ్ మున్సిపల్ ఛైర్మన్‌గా తిమ్మప్ప
ATP: కళ్యాణదుర్గం మున్సిపల్ కార్యాలయంలో ఇంఛార్జ్ మున్సిపల్ ఛైర్మన్‌గా హరిజన తిమ్మప్ప సోమవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు మున్సిపల్ చైర్మన్‌గా ఉన్న తలారి రాజకుమార్ తన విధులను సక్రమంగా నిర్వర్తించకపోవడంతో ఆయనను చైర్మన్ పదవి నుంచి ప్రభుత్వం తొలగించింది. దీంతో తిమ్మప్పను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.