మేతకు వెళ్ళిన ఎద్దులను చంపిన పులి

ప్రకాశం: అర్ధవీడు మండలం వెలగలపాయ సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో మేతకు వెళ్ళిన రెండు ఎద్దులను పులి దాడి చేసి చంపింది. బుధవారం అడవిలోకి వెళ్లిన ఎద్దులను గురువారం సాయంత్రం రైతులు గుర్తించారు. ఈ దాడిలో రూ.1,30,000 విలువైన ఎద్దులు మరణించాయని బాధితులు తెలిపారు. కాగా, అధికారులు పులి సంచారాన్ని ట్రాప్ కెమెరాల ద్వారా గుర్తిస్తున్నారు.