'పన్ను వసూల్లో ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లు భాగస్వామి కావాలి'

'పన్ను వసూల్లో ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లు భాగస్వామి కావాలి'

ELR: ఇంటి పన్ను వసూళ్లలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు భాగస్వాములు కావాలని ఉంగుటూరు ఎంపీడీవో మనోజ్ పిలుపునిచ్చారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లకు ఆన్‌లైన్ పన్ను చెల్లింపులపై శిక్షణ ఇచ్చారు. ఇంటి, కుళాయి పన్నుల వసూళ్ల ద్వారా గ్రామ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. పంచాయితీ అభివృద్ధి అధికారి ప్రసాద్ శిక్షణ ఇచ్చారు.