అల్వాల్‌లో సీసీ రోడ్డు పనులు ప్రారంభం
MDCL: అల్వాల్ సర్కిల్ ఉమ్మడి మచ్చ బొల్లారం డివిజన్ పరిధి మా సంతోషి కాలనీలో బుధవారం రూ. 20 లక్షల వ్యయంతో ప్రతిపాదించిన సీసీ రోడ్డు పనులను మాజీ కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్‌తో కలిసి కాలనీ వాసులు ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్యే మదనపల్లి హనుమంతరావు సహకారంతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వారు తెలిపారు. స్థానిక నాయకులు, కాలనీ ప్రతినిధులు పాల్గొన్నారు.