పారిశుద్ధ్య పనులను పరిశీలించిన కమిషనర్

పారిశుద్ధ్య పనులను పరిశీలించిన కమిషనర్

E.G: ప్రతి దుకాణం వద్ద చెత్తబుట్ట తప్పనిసరిగా ఉండాలని రాజమండ్రి నగర పాలక కమిషనర్ రాహుల్ మీనా స్పష్టం చేశారు. శనివారం మెయిన్ రోడ్డు పరిసరాల్లో పారిశుద్ధ్య పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కార్మికుల హాజరుపై ఆరా తీశారు. రికార్డులు పక్కాగా నిర్వహించాలని సూచించారు. రహదారులు, డ్రైనేజీలను నిత్యం శుభ్రం చేస్తూ.. బ్లీచింగ్ చల్లాలని సిబ్బందిని ఆదేశించారు.