VIDEO: రోడ్డు ప్రమాదం.. దంపతులకు తీవ్ర గాయాలు
MDK: నార్సింగి మండలం జాప్తి శివనూర్ పరిధిలో సరోజిన్ నగర్ వద్ద జాతీయ రహదారిపై ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి రామయంపేట్ వెళ్తున్న ద్విచక్ర వాహనం రాంగ్ రూటులో వస్తున్న ట్రాక్టర్ ఢీకొన్నాయి. ద్విచక్ర వాహనంపై దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానికులు చికిత్స నిమిత్తం రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.