జిందాల్ కంపెనీ వద్ద ఎమ్మెల్యే ఆందోళన

జిందాల్ కంపెనీ వద్ద ఎమ్మెల్యే ఆందోళన

స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుతూ గూడూరు ఎమ్మెల్యే పి. సునీల్ కుమార్ జిందాల్ కంపెనీ ఎదుట శుక్రవారం ఆందోళన చేపట్టారు. చిల్లకూరు మండలంలో ఏర్పాటైన జిందాల్ పరిశ్రమలో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా స్థానికేతరులకు అధిక సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.