రోడ్డు సౌకర్యం లేక ఇబ్బందులు

రోడ్డు సౌకర్యం లేక ఇబ్బందులు

ADB: గాదిగూడ మండలం మారుమూల గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పౌనూర్, లొద్దిగూడ గ్రామాలకు 40 ఏళ్లుగా సరైన రోడ్డు సౌకర్యం లేక ప్రజలు, వాహనదారులు అనేక కష్టాలు పడుతున్నారు. అత్యవసర సమయంలో 108 అంబులెన్స్ సైతం రాలేని దుస్థితి నెలకొంటుంది. ఇకనైనా అధికారులు స్పందించి బీటీ రోడ్డు వేయాలని ప్రజలు కోరుతున్నారు.