పోలింగ్ స్టేషన్‌ను సందర్శించిన డీసీపీ
RR: రెండో విడత స్థానిక సంస్థల గ్రామపంచాయతీ ఎన్నికలు ఆదివారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాజేంద్రనగర్ DCP యోగేశ్ గౌతమ్ శంకర్‌పల్లి మండల పరిధిలోని మహాలింగాపురం గ్రామంలోని పోలింగ్ స్టేషన్‌ను సందర్శించారు. పోలింగ్ సిబ్బందితో డీసీపీ మాట్లాడారు. అవసరమైన సూచనలు ఇచ్చారు. ఆయన వెంట సీఐ శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు.